ఉపాధి హామీ, గృహ నిర్మాణ పనులపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

UPDATED 15th JUNE 2017 THURSDAY 4:00 PM

కాకినాడ: జిల్లాలోని కాకినాడ రూరల్, పిఠాపురం, శంఖవరం, ప్రత్తిపాడు, జగ్గంపేట మండలాల్లో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా గురువారం సుడిగాలి పర్యటన చేశారు. ఆయా మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం ఏడు గంటల నుంచే కలెక్టర్ తనిఖీలను ప్రారంభించారు. దీనిలో భాగంగా కాకినాడ రూరల్ మండలం పెనుమర్తిలో గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. గృహ నిర్మాణ లబ్ధిదారులను కలిసి వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే మస్తర్లను తనిఖీ చేశారు. ఉపాధి హామీ పథకంలో కూలీలందరికీ పనులు కల్పించాలని ఆదేశించారు. అలాగే కూలీల మస్తర్లను స్వయంగా పరిశీలించాలని డ్వామా పిడి రాజకుమారిని కలెక్టర్ ఆదేశించారు. పిఠాపురం మండలం చిత్రాడ, చంద్రంపాలెం, పవర ఫీల్డ్ ఛానల్ పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. కుమారపురం గ్రామంలో వృద్దులైన పైడితల్లి గృహాన్నిసందర్శించి ఆమెకు అందుతున్న పింఛన్, బియ్యం పంపిణీపై ఆరా తీశారు. ఎఫ్ కె పాలెం గ్రామంలో గుడాల వీరయ్యమ్మ గృహనిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శంఖవరం మండలం కత్తిపూడి, నెల్లిపూడి, గ్రామాల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను, ఉపాధి పనులను పరిశీలించారు. అలాగే గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రత్తిపాడు మండలంలోని ఒమ్మంగి గ్రామంలో జరుగుతున్న సేద్యపు నీటికుంటల పనులను కలెక్టర్ పరిశీలించారు. అలాగే కూలీల హాజరును అడిగి తెలుసుకున్నారు. జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో పంట కాలువల అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్ ను తనిఖీ చేశారు. మధ్యాహ్నభోజనం 20 మంది పిల్లలకు మాత్రమే పెట్టామని ప్రధానోపాధ్యాయుడు కలెక్టర్ కు వివరించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో పిల్లలకు మధ్యాహ్నభోజనం అందించాలని ఆయన ఆదేశించారు. అలాగే గ్రామంలో హౌసింగ్ స్కీం కింద మంజూరు చేసిన కొత్త ఇంటిని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి జి. విశ్వేశ్వర ప్రసాద్, కాకినాడ, పెద్దాపురం ఆర్డీవో లు ఎల్.రఘుబాబు, వి.విశ్వేశ్వరరావు, తహసీల్దార్లు సింహాద్రి, వెంకట్రావు, నాగమల్లేశ్వరరావు, శివమ్మ, ఎంపిడివోలు విశ్వనాథరెడ్డి, పి.రామకృష్ణ, వాసుదేవరావు, శ్రీనివాసరావు, ఎపిడి ప్రసాద్, ఏపీవోలు, వర్క్ ఇనస్పెక్టర్ లు, తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us