మరిడమ్మ జాతర మహోత్సవాలను విజయవంతం చేయాలి

UPDATED 22 nd JUNE 2017 THURSDAY 7:00 PM

పెద్దాపురం: భక్తుల కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లి పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను విజయవంతం చెయ్యాలని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ ఆర్.పుష్పనాథం కోరారు. స్థానిక మరిడమ్మ కాలక్షేప మండపంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 24 నుంచి జూలై 30వ తేదీ వరకు నిర్వహించే జాతర మహోత్సవాలలో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో, చలువ పందిళ్ళుతో సర్వాంగ సుందరంగా అలకరించినట్లు పేర్కొన్నారు. అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. కళ్ళు మిరుమిట్లుగొలిపే బాణసంచా, డప్పు వాయిద్యాలు, గరగల నృత్యాలు, పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే 23న అమ్మవారి జాగరణ మహోత్సవం నిర్వహిస్తామని, ఈ మహోత్సవానికి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, దేవాదాయ శాఖామంత్రి  పైడికొండల మాణిక్యాలరావు, కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తోట నరసింహంతో పాటు దేవాదాయశాఖ కమీషనర్ వై.వి. అనురాధ, రీజనల్ జాయింట్ కమీషనర్ ఎస్.ఎస్. చంద్రశేఖర్ ఆజాద్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారన్నారు. అలాగే పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని జాతర మహోత్సవాలను విజయవంతం చెయ్యాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు ఆకుల మురళీకృష్ణ, కొంగర సత్యనారాయణ, గోలి శ్రీరాములు, గోమాడ అర్జున్, కొప్పర్తి కృష్ణ, కొఠాని గణేష్, రాయ విజయ్ తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us