TS News: యాదాద్రీశుడి ఆలయానికి భారీగా విరాళాలు

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 : యాదాద్రీశుడి ఆలయ విమాన గోపురం బంగారు తాపడానికి పలువురు విరాళాలు ఇచ్చారు. హెటిరో డ్రగ్స్, హానర్‌ ల్యాబ్స్‌ రూ.2.50 కోట్ల విరాళం అందించాయి. హెటిరో డ్రగ్స్‌ సీఎండీ బండి పార్థసారథి రెడ్డి, హానర్ ల్యాబ్స్‌ తరఫున దేవరకొండ దామోదరరావు చెక్కులను ఆలయ ఈవోకు అందించారు. హెటిరో డ్రగ్స్‌ లిమిటెడ్‌ తరఫున రూ.50లక్షలు, హెటిరో ల్యాబ్స్‌ లిమిటెడ్‌ తరఫున రూ.50లక్షలు, హానర్‌ ల్యాబ్‌ లిమిటెడ్‌ తరఫున రూ.50లక్షలు, వ్యక్తిగతంగా బండి పార్థసారథి రెడ్డి రూ.50లక్షలు, దేవరకొండ దామోదర్‌రావు రూ.50లక్షలు విరాళం అందించారు. మంత్రి సత్యవతి రాఠోడ్‌ విరాళం.. బంగారు తాపడం కోసం మంత్రి సత్యవతి రాఠోడ్‌ విరాళమిచ్చారు. తన ఒంటిపై ఉన్న నగలను ఆమె విరాళంగా ఇచ్చారు. 12తులాల బంగారాన్ని ఆలయ ఈవో గీతకు సత్యవతి రాఠోడ్ అందించారు. యాదాద్రిని కేంద్ర మంత్రి భగవంత్‌ ఖుబా సందర్శించారు. యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us