Vande Bharat Train: గుడ్ న్యూస్.. ఏపీకి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ .. ఈ మార్గంలో పరుగులు!

UPDATED 15th NOVEMBER 2022 TUESDAY 6:10 PM

Vande Bharat Express Train: ఏపీ ప్రజలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. ఇప్పటికే విశాఖపట్టణం రైల్వే స్టేషన్‌ ఆధునీకరణకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.. ఇప్పుడు వందే భారత్ రైలును కూడా కేటాయించారు. దీంతో రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలోనే ఏపీకి రానుంది. విశాఖపట్టణం నుంచి మరో రెండు నెలల్లో ప్రారంభమవుతుందని వాల్తేరు డీఆర్ఎం అనూప్ సత్పతి మీడియాకు తెలియజేశారు .

విశాఖ నుంచి ఏ మార్గంలో నడపాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. విశాఖ నుంచి తిరుపతి లేదంటే, విజయవాడకు నడిపే అవకాశముంది. ఈ రైలు వేగానికి వీలుగా ప్రస్తుత ట్రాక్ సామర్థ్యం సరిపోతుందని.. ఒకసారి ప్రయోగాత్మకంగా పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో.. ఇతర రైళ్ల మాదిరి స్లీపర్ బెర్త్‌లు ఉండవు. బస్సులో వెళ్లినట్లుగానే.. కూర్చొనే ప్రయాణించాలి. అందువల్ల గరిష్ఠంగా 10 గంటల లోపే గమ్యస్థానానికి వెళ్లే.. రూట్లను రైల్వే అధికారులు పరిశీలిస్తున్నారు.

కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటి వందే భారత్ రైలును అక్టోబర్ 13న ప్రారంభించిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలో ఈ రైలును ప్రారంభించారు. ఇది అంబ్ అందౌరా నుంచి ఢిల్లీకి కేవలం రెండు గంటల్లో చేరుకుంటుంది.

ప్రస్తుతం మనదేశంలో ప్రస్తుతం ఐదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. న్యూ ఢిల్లీ నుంచి వారణాసి (యూపీ), శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా (జమ్మూకాశ్మీర్), అంబ్ అందౌరా (హిమాచల్ ప్రదేశ్), ముంబై సెంట్రల్ నుంచి గాంధీ నగర్‌, మైసూర్-బెంగళూరు-చెన్నై రూట్లో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును తెలంగాణకు కేటాయించారు. సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తుంది. సికింద్రాబాద్ నుంచి ఏమార్గంలో నడుస్తున్నందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సికింద్రాబాద్-విజయవాడ-తిరుపతి మార్గంలో నడిపే అవకాశమున్నట్లు సమాచారం.

వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నాటికి 75 వందే భారత్ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 52 సెకండ్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం వందే భారత్ రైలు ప్రత్యేకత.
 
ఇతర రైళ్లతో పోలిస్తే వందే భారత్ రైళ్లల్లో ప్రయాణించడం ద్వారా ప్రయాణ సమయం 25 శాతం నుంచి 45 శాతం వరకు తగ్గుతుంది. ఇందులో ఆటోమెటిక్ డోర్స్ ఉంటాయి. జీపీఎస్ బేస్డ్ ఆడియో విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వైఫై హాట్‌స్పాట్ ఉపయోగించుకోవచ్చు. 

వందే భారత్ రైళ్లల్లో సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి. ఎగ్జిక్యూటీవ్ క్లాస్ బోగీల్లో రొటేటింగ్ చైర్లు ఉంటాయి. బయోవ్యాక్యూమ్ టైప్ టాయిలెట్స్ ఉంటాయి. దివ్యాంగులకు అనుకూలంగా వాష్‌రూమ్స్ ఉంటాయి. సీట్ హ్యాండిల్‌కు, సీట్ నెంబర్స్‌కు బ్రెయిలీ లెటర్స్ ఉంటాయి. ప్రతీ కోచ్‌కు ప్యాంట్రీ సదుపాయం ఉంటుంది. వేడివేడి కాఫీ, భోజనం, కూల్ డ్రింక్స్ అందుబాటులో ఉంటాయి.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us