పాఠశాల స్థలం ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోరా ?

* రోడ్లపై మురికి నీరు ప్రవహిస్తుంటే ఏంచేస్తున్నారు? 
* మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు ఫైర్
UPDATED 20th JUNE 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్ పర్సన్ మన్యం పద్మావతి అధ్యక్షత బుధవారం జరిగింది. ఈ సమావేశంలో పదిహేను అంశాలకు సంబంధించి చర్చ జరిగింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడు ఆవాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అల్లం వారి వీధిలో ఉన్న పాఠశాలలో ఒక గది మాత్రమే ఉందని, దీని వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే అదనపు గదులు నిర్మించాలని, అలాగే పాఠశాల స్థలం ఆక్రమణలకు గురవుతోందని వెంటనే ప్రహరీ గోడ నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ కమీషనర్  సి.హెచ్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ పాఠశాలకు సంబంధించి ప్రపోజల్స్ పంపించామని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆరవ వార్డు కౌన్సిలర్ ఊబా జాన్ మోజెస్ మాట్లాడుతూ మేజర్ డ్రైన్ మూసుకుపోవడం వల్ల వర్షం వచ్చినప్పుడు మురికినీరు రోడ్లపై ప్రవహిస్తోందని, ఈ డ్రైన్ ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది వార్డులకు ఉపయోగపడుతుందని వెంటనే పనులు చేపట్టాలన్నారు. మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా పనులు చేపడమన్నారు. ఎస్సీ కల్యాణ మండపం నిర్మాణం విషయంలో ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా త్వరలోనే దీనికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభిస్తామని కమీషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, ఇంచార్జ్ డీఈ ప్రభాకరరావు, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us