మార్త మృతికి ఘన నివాళి

UPDATED 12th FEBRUARY 2018 MONDAY 6:30 PM

సామర్లకోట: తూర్పుగోదావరి సామర్లకోట ఎంపీపీ గొడతా మార్త మృతికి స్థానిక ఎండివో కార్యాలయంలో ఆమెకు అధికారులు ఘన నివాళులు అర్పించి సంతాపం తెలియచేశారు. ఎంపీడీవో బి.నాగేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమంలో ఆమె మండల అభివృద్ధికి అందించిన సేవలను కొనియాడారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాసు, ఈవోపీఆర్డీ సి.ఎచ్. జగ్గారావు, ఎంఈవో కె. వెంకట రమణమ్మ, తహసీల్దార్ కార్యాలయ డిప్యూటీ డీటీ ఎన్.ఎస్.ఎన్. ప్రసాద్, ఉపాధిహామీ, వెలుగు కార్యాలయల సిబ్బంది, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us