Ooru Peru Bhairavakona Teaser : గరుడ పురాణం.. సందీప్ కిషన్ కొత్త మూవీ కథ.. టీజర్ వచ్చేసింది!

Updated 7th May 2023 Sunday 1:05 pm

Ooru Peru Bhairavakona Teaser : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) ఇటీవల మైఖేల్ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తమిళ దర్శకుడు తెరకెక్కించిన ఈ మూవీ పై సందీప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందించలేక పోయింది. ఇక ఇప్పుడు ”ఊరు పేరు భైరవకోన” అనే హారర్ థ్రిల్లర్ ఫిలింతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ పోస్టర్ అండ్ ఒక సాంగ్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. తాజాగా టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సినిమా కథ గరుడ పురాణం గ్రంథం చుట్టూ తిరగనుంది. ఆ గ్రంథంలో మిస్ అయ్యిన నాలుగు పేజీలే ఈ భైరవకోన కథ అంటూ సందీప్ తెలియజేశాడు. టీజర్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. అలాగే విజువల్ వండర్ గా కూడా ఉంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కించిన వి ఐ ఆనంద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. వర్ష బాలమ్మ (Varsha Bollamma), కావ్య థాపర్, వెన్నల కిషోర్, వైవా హర్ష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us