శ్రీ ప్రకాష్ లో ఘనంగా ముగిసిన నాటక కార్యశాల

UPDATED 4th JUNE 2017 SUNDAY 5:00 PM

పెద్దాపురం : స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్లో  సాంస్కృతిక సమాఖ్య సారధ్యంలో వారం రోజుల పాటు జరిగిన నాటక కార్యశాల ముగింపు ఉత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు ఉత్సవాలను రాజస్థాన్ కేంద్ర విశ్వవిద్యాలయ సహాయక ప్రొఫెసర్ తూము శివ, షాజహాన్, కేంద్ర నాటక విద్యాలయం (జార్ఖండ్) నగేష్ సంయుక్తంగా నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులకు నాటక ప్రక్రియకు సంబందించి ప్రాధమిక అంశాలు అయిన భావం, ధ్వని, అనుకరణ మొదలైన విషయాలపై విద్యార్థులకు తర్ఫీదునిచ్చారు. అలాగే ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రముఖ కళాకారుడు దంటు సూర్యారావు మాట్లాడుతూ కళలకు వన్నె తేవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ కళలపై  విద్యార్థులు మక్కువ పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రిన్సిపాల్ మూర్తి, విద్యార్థులు, పలువురు కళా ప్రముఖులు హాజరయ్యారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us