UPDATED 6 FEBRUARY 2022 SUNDAY 11:00 AM
న్యూఢిల్లీ (రెడ్ బీ న్యూస్) : భారత రత్న లతా మంగేష్కర్ మరణం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆదివారం ఇచ్చిన ట్వీట్లలో, లతా మంగేష్కర్ మరణంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలు పగిలినట్లుగానే తన గుండె కూడా చెదిరిందని పేర్కొన్నారు. అనేక రకాలైన, విస్తృత స్థాయిలోని ఆమె పాటలు భారత దేశ సారాన్ని, సౌందర్యాన్ని ప్రతిఫలింపజేశాయన్నారు. అనేక తరాలు తమ మనసు లోతుల్లోని భావాల వ్యక్తీకరణను గుర్తించాయన్నారు. భారత రత్న లతా జీ సాధించిన విజయాలు సాటిలేనివన్నారు.
కళాకారుడు జన్మిస్తాడు, అయితే శతాబ్దాలకు ఒకసారి. లతా దీదీ ఓ అసాధారణ వ్యక్తి. పరిపూర్ణమైన ఆత్మీయతగల వ్యక్తి. నేను ఆమెను కలిసిన ప్రతిసారీ ఈ విషయాలను గమనించాను. దివ్యమైన గళం శాశ్వతంగా మూగబోయింది. కానీ ఆమె మెలోడీస్ అమరత్వంతో శాశ్వతంగా నిలుస్తాయి. ఆమె కుటుంబ సభ్యులకు, అన్ని చోట్లగల అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని కోవింద్ పేర్కొన్నారు.







