Updated 26 January 2022 Wednesday 09:15 AM
అమరావతి (రెడ్ బీ న్యూస్): రిపబ్లిక్ డేని పురస్కరించుకొని ఈ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులని మంగళవారం సాయంత్రం ప్రకటించింది. అన్ని రాష్ట్రాల నుంచి అనేక రంగాలలో సేవలందించిన ఎంతోమంది ప్రముఖులకు ఈ అవార్డులని ప్రకటించారు. మన తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు కూడా పద్మ అవార్డులు దక్కాయి. పద్మ అవార్డులు దక్కిన వారికి అందరూ అభినందనలు తెలుపుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పద్మ అవార్డులు దక్కిన వారికి జనసేన పార్టీ తరపున, తన తరపున అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.







