మాదాల ఆశయ సాధనకు కృషి చేయాలి

UPDATED 27th MAY 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: రెడ్ స్టార్ మాదాల రంగారావు ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు. స్థానిక విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ భవనంలో కామ్రేడ్ మాదాల రంగారావు చిత్రపటానికి సిపిఐ పార్టీ శ్రేణులు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి జిల్లా నాయకులు ఆదివారం పాల్గొని పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి మధు మాట్లాడుతూ మాదాల రంగారావు ఎన్నో విప్లవ చిత్రాలలో నటించి, సమాజంలో జరుగుతున్న అవినీతిని తన సినిమాలలో చూపించి ప్రజలను చైతన్య పరిచిన నటుడని ఆయన మృతి కమ్యూనిస్టు పార్టీకి, కళారంగానికి తీరని లోటన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాలు జరిపేవారని సినిమా రంగంలో సామరస్య వాద విషసంస్కృతి పెరిగిపోతున్న దశలో అభ్యుదయ భావాలతో ఆయన నిర్మించిన చిత్రాలు ప్రజలను ఎంతో చైతన్య పరిచాయని అన్నారు. ప్రజా నాట్య మండలి కార్యదర్శి మహంతి లక్ష్మణరావు మాట్లాడుతూ మాదాల రంగారావుతో విశేష పరిచయం ఉందని, ఆయన మరణవార్త విని జీర్ణించుకోలేక పోయానన్నారు. సినిమా రంగంలోఆయన ఎంతో మంది నటీ, నటులకు అవకాశాలు కల్పించారని, సుమారు 70 చిత్రాల్లో నటించారని, 15 చిత్రాలు నిర్మించారని, అలాగే దర్శకత్వం కూడా వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి జిల్లా కోశాధికారి ముప్పన కుమార్, మడగల రమణ, పెద్దిరెడ్డి అర్జునరావు, ఏడుకొండలు, అల్లూరి భద్రం, సప్పా సూరిబాబు, కామిరెడ్డి బోడకొండ, పెద్దిరెడ్డి సత్యనారాయణ, ఎలిశెట్టి రామదాసు, బికెఎం జిల్లా అధ్యక్షులు నక్కి కిషోర్, తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us