అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : ఏపీలో రూ.18వేల కోట్లతో 3 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపటనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. సకల రవాణా మార్గాలూ సమృద్ధిగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని స్పష్టం చేశారు. ప్రతి రవాణా మార్గం మరో మార్గంతో పూర్తి అనుసంధానం ఏపీ ప్రత్యేకత అన్నారు. పీఎం గతిశక్తిపై కేంద్ర సమన్వయం కోసం ప్రతి రాష్ట్రం నుంచి ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించనున్నట్లు వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల సమక్షంలో "పీఎం గతిశక్తి"పై కేంద్రం నిర్వహించిన వర్చువల్ సదస్సులో మంత్రి మేకపాటి ఈ వ్యాఖ్యలు చేశారు.







