AP News: ఏపీలో మరో మంత్రికి కరోనా పాజిటివ్

UPDATED 22 JANUARY 2022 SATURDAY 07:00 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్) : ఏపీలో మరో మంత్రి కరోనా బారిన పడ్డారు. ఇటీవల మంత్రి కొడాలి నాని కొవిడ్ బారినపడి కోలుకోగా.. తాజాగా ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందనీ.. స్వల్ప లక్షణాలే ఉన్నాయని ఆయనే స్వయంగా ప్రకటించారు. హోం ఐసోలేషన్ లోనే ఉన్నట్టు తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసినవారంతా జాగ్రత్తగా ఉండాలనీ.. పరీక్షలు చేయించుకోవాలని ట్విటర్ లో కోరారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ఏపీలో కొవిడ్ కేసులు మళ్లీ భారీ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 43,763 టెస్టులు చేయగా.. 12,926 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 78 వేలకు చేరడం గమనార్హం.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us