కేంద్ర పథకాలకు సీఎం పేరు ఎలా పెట్టుకుంటారు?: సోము వీర్రాజు

గుంటూరు (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021: కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి పేరు పెట్టుకోవడమేంటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న 36 పథకాలకు కేంద్రం సాయం చేస్తోందన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సైతం ప్రధాని పేరున కాకుండా తమ పేర్లు వేసుకుంటున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. కేంద్రం రాష్ట్రానికి 21 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని, ఒక్కో ఇంటికి రూ.1.80లక్షలు మంజూరు చేస్తుందని వివరించారు. గుంటూరులో రాజ్యాంగ ఆమోద ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ద్విచక్రవాహన ర్యాలీలో సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us