సముద్రతీర ప్రాంతాల్లో తుఫాన్ షెల్టర్లు

UPDATED 4th AUGUST 2017 FRIDAY 5:00 PM

పెద్దాపురం: సముద్రతీర ప్రాంతాల్లో రూ. మూడు కోట్లతో తుఫాన్ షెల్టర్లు నిర్మించనున్నట్లు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక రామారావు పేట సిటిజెన్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో యువజన సంక్షేమ శాఖ, రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రకృతి వైపరీత్యాల నివారణకు సంబందించిన శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. రెడ్ క్రాస్ జిల్లా మేనేజ్మెంట్ చైర్మన్ శివ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హోం మంత్రి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ప్రజలకు ఎటువంటి నష్టం కలుగకుండా రూ.మూడు కోట్లతో తుఫాను షెల్టర్లు నిర్మిస్తున్నామన్నారు. తుఫాను షెల్టర్లలో నిత్యావసర వస్తువులు ఉంచి తుఫానులు, వరదలు సంభవించినపుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామన్నారు. దీనిలో భాగంగా తుఫానులు, వరదలు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు సంభవించినపుడు ప్రజలకు సేవలు అందించేందుకు ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నాలుగు రోజులు పాటు ఈ శిక్షణ ఇచ్చి అనంతరం వారికి సర్టిఫికెట్లు ప్రధానం చేస్తామన్నారు. ఈ శిక్షణ ద్వారా తీసుకున్న సర్టిఫికెట్లు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఉద్యోగాలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అలాగే తుఫానులు వచ్చే ప్రాంతాలను, పిడుగులు పడే ప్రాంతాలను గుర్తించేందుకు అత్యాధునిక పరికరాలతో కూడిన వ్యవస్థను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి తెలిపారు. సెట్రాజ్ సీఈవో రమణ మాట్లాడుతూ యువజన సంక్షేమం ద్వారా చదువుకున్న విద్యార్థులకు, చదువు లేని వారికి ఇప్పటి వరకు ఎనిమిది బ్యాచ్ లకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. యువతీ, యువకులు ఈ శిక్షణా తరగతులు ఉపయోగించుకోవాలని సీఈవో కోరారు. అనంతరం ఇటీవల ప్రారంభించిన రైతు బజార్ ను హోం మంత్రి పరిశీలించారు. అలాగే ఎక్కువ మంది ప్రజలు ఇక్కడికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులని ఆదేశించారు. అలాగే సమీపంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణమండపాన్ని మంత్రి పరిశీలించి దీని నిమిత్తం రూ.15 లక్షలు మంజూరైందని త్వరలోనే పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, ఆర్డీవో వి. విశ్వేశ్వరావు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారు బాబు, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్.శేషాద్రి, ఎంపిపి గుడాల రమేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ త్సలికి సత్య భాస్కర్, కౌన్సిలర్ నాగమణి, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, తదితరులు పాల్గొన్నారు.  
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us