తిరుపతి (రెడ్ బీ న్యూస్) 23 అక్టోబర్ 2021: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శనివారం తిరుమల శ్రీవారిని 28,154 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.15కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 13,077 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.







