UPDATED 5th MARCH 2022 SATURDAY 08:00 AM
Rashmika Mandanna : శర్వానంద్, రష్మిక జంటగా నటించిన సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 4న విడుదలైంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది ఈ సినిమా. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రష్మిక మాట్లాడుతూ… ”పెళ్లి చూపుల పేరుతో ఆడవాళ్ళు పడే కష్టాలు అన్ని ఈ సినిమాలో చూశాను. నగలు వేసుకొని, చీర కట్టుకొని, పువ్వులు పెట్టుకొని ఇష్టం ఉన్నా లేకున్నా అన్నీ అలకరించుకొని మగాడి ముందు తల దించుకొని కూర్చోవాలి. ఇలాంటి బాధలు చూశాక నాకైతే మరో జన్మ వుంటే మగాడిగా పుడితే బాగుండు అనిపిస్తుంది. అప్పుడు నేనే కాలు మీద కాలేసుకొని, ప్రశ్నలు అడుగుతూ హ్యాపీగా కూర్చోవచ్చు” అని తెలిపింది.







