CM Jagan : నన్ను ఎవరూ పీకలేరు..ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్

UPDATED 9th APRIL 2022 SATURDAY 07:00 AM

CM Jagan : ఏపీలో ఎన్నికలకు రెండేళ్ల దాకా గడువున్నా.. అప్పుడే పొలిటికల్‌ హీట్‌ తగులుతోంది. ప్రతిపక్షాలు దూకుడు వ్యవహరిస్తుండడంతో.. అధికార పార్టీ కూడా గట్టిగానే రివర్స్‌ ఎటాక్‌ చేస్తోంది. ఏకంగా సీఎం జగన్మోహన్‌ రంగంలోకి దిగి ప్రతిపక్ష నేతల్ని ఏకిపారేస్తున్నారు. జనం ఆశీర్వాదం ఉన్నంతకాలం తనను ఎవరూ ఏమీ పీకలేరంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు సీఎం జగన్‌.

నంద్యాలలో నిర్వహించిన జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో.. టీడీపీ, జనసేన నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం జగన్. వారి అసూయకు మందే లేదంటూ ఫైర్‌ అయ్యారు. పిల్లలకి ఇచ్చే చిక్కీపై సీఎం బొమ్మ ఉందంటూ విపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు టీడీపీ నేతలకు కనిపించవని.. ఎవరెన్ని సమస్యలు సృష్టించినా.. తన వెంట్రుక కూడా పీకలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్‌.కడుపుమంట దాచుకుంటే గుండెపోటు వస్తుందంటూ ఎద్దేవా చేశారు. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నామని.. స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. పేదరికం కారణంగా పిల్లల చదువులు ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోకూడదన్నారు. త్వరలో రాష్ట్రానికి 16 మెడికల్ కాలేజీలు రాబోతున్నాయన్నారు సీఎం జగన్‌.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us