తాడేపల్లిగూడెం (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో శనివారం సాయంత్రం రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. అతనితోపాటు ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. జువ్వలపాలెంనకు చెందిన దొరబాబు(35) రౌడీ షీటర్. పలు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న దొరబాబును గుర్తు తెలియని వ్యక్తులు ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న శ్రీనివాస్ లాడ్జి ఎదుట వెంటాడి బ్లేడుతో గొంతు కోసి పరారయ్యారు. అతడితో పాటు మరో వ్యక్తిపై కూడా బ్లేడుతో దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో దొరబాబు అక్కడికక్కడే మృతి చెందగా, విషమంగా ఉన్న మరో వ్యక్తిని తణుకు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.







