అట్టహాసంగా ప్రారంభమైన జిమ్నాస్టిక్స్‌ పోటీలు

UPDATED 11th AUGUST 2017 FRIDAY 8:00 PM

కాకినాడ : జిల్లా జిమ్నాస్టిక్‌ అసోసియేషన్‌, లయన్స్‌ క్లబ్‌ ఎలైట్‌ సంయుక్త ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్నఅంతర్ జిల్లాల జిమ్నాస్టిక్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ ఎన్‌ఎఫ్‌సిఎల్‌ రోడ్డులో ఉన్న జిల్లా క్రీడా మైదానంలో లయన్స్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ డి.ఎస్‌.ఎస్‌.వి.వర్మ జ్యోతిప్రజ్వలన చేసి ఈ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి సుమారు 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలైట్‌ క్లబ్‌ వ్యవస్థాపకులు ముంజులూరి విశ్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సమావేశంలో వర్మ మాట్లాడుతూ క్రీడలతోనే దేశానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని, ఆ దిశగా క్రీడాకారులు అంకిత భావంతో కృషి చేయాలన్నారు. శాఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్‌వి.రమణ మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, కాకినాడ స్పోర్ట్స్‌గ్రౌండ్‌లో జిమ్నాస్టిక్‌ ఆడిటోరియం ఏర్పాటు తన దశాబ్ధాల కోరికని, ఈ ఆడిటోరియాన్ని మార్పులు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు తాము రూపొందిస్తున్నామన్నారు. అనంతరం పోటీలు ప్రారంభించారు. ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్‌ విభాగంలో బాలురకు ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌, ఫామల్‌ ఆర్ట్స్‌, రింగ్‌, టేబుల్‌వాల్‌, పేర్లర్‌బార్‌, హైబార్‌, బాలికలకు టేబుల్‌వాల్‌, అన్‌ ఈవెన్‌బాల్‌, బాలెన్సింగ్‌ బీమ్‌, ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌, రిథమిక్‌ జిమ్నాస్టిక్‌ విభాగంలో బాలికలకు హూప్‌, రిబ్బన్‌, క్లబ్స్‌ విభాగాల్లో పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిమ్నాస్టిక్స్ సంఘం రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు, జిల్లా ఒలెంపిక్ సంఘం అధ్యక్ష, ఇంచార్జి కార్యదర్శులు చుండ్రు గోవింద రాజులు, రవిరాజు, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ బాదం బాలకృష్ణ, శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల డైరెక్టర్ సి.హెచ్. విజయ ప్రకాష్, తదితరులు  పాల్గొన్నారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us