రాజన్న రాజ్యాన్ని తీసుకురావడమే సంకల్పం

UPDATED 15th MAY 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేందుకు మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలన్నదే తన సంకల్పమని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు అన్నారు. వైసిపి అధ్యక్షుడు జగన్ మోహన రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర రెండు వేల కిలోమీటర్ల పూర్తయిన సందర్భంగా ఆయనకు సంఘీభావంగా రెండు రోజులపాటు నియోజకవర్గంలో నిర్వహించిన వంచనపై పాదయాత్ర మంగళవారం ముగిసింది. రెండవ రోజు పాదయాత్ర స్థానిక రాజా చిన్నారావు ఫంక్షన్ హాలు నుంచి ప్రారంభమై సామర్లకోట, పెద్దాపురం, గుడివాడ, సిరివాడ మీదుగా కాండ్రకోటలో నూకాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ముగిసింది. అడుగడుగునా ప్రజలు తోట సుబ్బారావు నాయుడుకి బ్రహ్మరథం పట్టారు. కాండ్రకోటలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్బారావునాయుడు మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయినా సరే ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, రాబోవు ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని, ఏపీలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శులు ఆవాల లక్ష్మీనారాయణ, కంటే వీర్రాఘవులు, పట్టణ అధ్యక్షుడు మద్దాల శ్రీను, మాజీ జడ్పీటీసీ బొబ్బరాడ సత్తిబాబు, జిల్లా కార్యదర్శి మేకా శ్రీను, కౌన్సిలర్ కాళ్ల లక్ష్మీనారాయణ, పట్టణ కోశాధికారి శెట్టిబత్తుల దుర్గ, టౌన్ సెక్రెటరీ, సేపేని సురేష్, జిల్లా సెక్రెటరీ మంచం సాయి, నేతల హరిబాబు, గంప శివ, పెద్దాపురం యూత్ ప్రెసిడెంట్ గోగు మురళి, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us