UPDATED 26th JUNE 2017 MONDAY 2:00 PM
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా సూపరెంటెండెంట్ ఆఫ్ పోలీస్ గా విశాల్ గున్ని సోమవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి ఉదయం చేరుకున్నఆయన సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన అనంతరం 9.40కి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అవినీతికి పాల్పడే అధికారులను సహించేది లేదని, శాంతిభద్రతల పరిరక్షణకు క్షేత్ర స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకూ అందరినీ సమన్వయం చేస్తూ ముందుకెళతామన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, అల్లర్లకు పాల్పడి శాంతి భద్రతలకు భంగం కల్గించే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. జిల్లాలో మరిన్ని కీలకమైన, సున్నితమైన అంశాల పట్ల అవగాహన చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. సమస్యలను ప్రజలు నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో తనను కలిసి విన్నవించవచ్చన్నారు. తాను అందుబాటులో లేని సందర్భంలో సమస్యల స్వీకరణను డీఎస్పీలు, సీఐలు చేపడతారన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టరు కార్తికేయ మిశ్రాను, రహదారులు, భవనాల శాఖ అతిథి గృహంలో రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని మర్యాదపూర్వకంగా కలిశారు.







