Crime News: అమెరికాలో కాల్పులు.. విశాఖ జిల్లా వాసి మృతి

UPDATED 12th FEBRUARY 2022 SATURDAY 05:00 PM

హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. అలాబామా రాష్ట్రంలో ఓ దుండగులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాకు చెందిన యువకుడు చిట్టూరి సత్యకృష్ణ (27) ప్రాణాలు కోల్పోయాడు. పాత బర్మింగ్ హోంలోని ఓ స్టోర్ లో క్లర్క్ గా పనిచేస్తోన్న సత్యకృష్ణ నెల రోజుల క్రితమే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సత్యకృష్ణ మృతి వార్త తెలియగానే ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. యువకుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు. భాజపా రాష్ట్ర నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి కూడా ఈ ఘటనపై ట్విటర్ వేదికగా స్పందించారు. సత్యకృష్ణ మృతి విచారకరమన్న ఆయన.. అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తగు సాయం అందించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కోరారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us