డ్రగ్ స్టోర్స్ పరిశీలించిన జెసీ

UPDATED 13th JULY 2020 MONDAY 7:00 PM

కాకినాడ(రెడ్ బీ న్యూస్): కోవిడ్ -19 కేర్ సెంటర్లకు అవసరమైన మందులు, పరికరాలను సకాలంలో సరఫరా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (డబ్ల్యూ) జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద గల సెంట్రల్ డ్రగ్ స్టోర్, జిల్లా వైద్యాధికారి కార్యాలయం వద్ద ఉన్న మెడిసిన్ స్టోర్ ను జాయింట్ కలెక్టర్  వైద్యాధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్లు, సిహెచ్ సి, పీహెచ్ సీ కోవిడ్-19 కు సంబంధించిన మందులు, పరికరాలను సక్రమంగా సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వీటిని సక్రమంగా సరఫరా చేసే విధంగా ప్రత్యేక నోడల్ అధికారి డిఆర్డీఏ పిడి వై. హరిహరనాథ్ పర్యవేక్షించాలని సూచించారు. ఈ పర్యటనలో జెసీ వెంట డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం. మల్లికార్జున్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ మణి రత్నకిషోర్, సదాశివరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us