జిల్లాస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కు సర్వం సిద్ధం

UPDATED 18th DECEMBER 2017 MONDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ లో ఈ నెల 19 నుంచి 21 వరకు మూడురోజులు పాటు జరగనున్న 22వ జిల్లాస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గల 28 కళాశాలలకు చెందిన విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారని, ఈ పోటీల్లో 15 వందల మంది విద్యార్థులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాల్ గున్ని, గెస్ట్ ఆఫ్ హానర్ గా జె.ఎన్.టి.యూ.కె. రెక్టార్ డాక్టర్ కె. పూర్ణానందం, ప్రత్యేక ఆహ్వానితులుగా ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె.ఎస్. వరప్రసాద్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.వి. సత్యనారాయణ హాజరుకానున్నారన్నారు. ఇప్పటికే రన్నింగ్ ట్రాక్, బాస్కెట్ బాల్, టెన్నికాయిట్, కబడ్డి కోర్టులు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాస రెడ్డి, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్ కుమార్, బి.పి.ఎడ్. ప్రిన్సిపాల్ శరభోజి, వైస్ ప్రిన్సిపాల్ ఎ. మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.         

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us