నూతన అటార్నీజనరల్‌గా కె కె వేణుగోపాల్ నియామకం

UPDATED 30th JUNE 2017 FRIDAY 11:00 PM

ఢిల్లీ: సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్(86) నూతన అటార్నీజనరల్‌గా నియమితులయ్యారు. ముకుల్ రోహత్గీ స్థానంలో వేణుగోపాల్ నియమితులయ్యారు. వేణుగోపాల్ నియామకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు అతిత్వరలోనే విడుదల కానున్నాయి. మోరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో వేణుగోపాల్ అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 2జీ స్పెక్ట్రం కేసులో అమికస్ క్యూరీగా వాదనలు వినిపించారు. మండల్ కేసు, అయోధ్య వివాదం, న్యాయవ్యవస్థలో నియామకాలపై సమర్థవంతంగా ఆయన తన వాదనలు వినిపించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు, బీజేపీ సీనియర్ నేత అద్వానీ అయోధ్య కేసు, మాయవతి అవినీతి కేసులను వేణుగోపాల్ వాదించారు. 50 ఏళ్ల తన సుదీర్ఘ కేరీర్‌లో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను ఆయన అందుకున్నారు. 2015లో పద్మ విభూషణ్, 2002లో పద్మ భూషణ్‌తో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వేణుగోపాల్‌ను వరించాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us