భవిష్యత్తులో ఆధునికంగా మార్కెట్లు

* రాష్ట్ర మత్స, పశు సంవర్ధక శాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణ

UPDATED 12th JUNE 2020 FRIDAY 6:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): రాష్ట్రంలో రాబోయే రోజుల్లో విజటబుల్, నాన్ విజిటబుల్ మార్కెట్లను అధునాతన మార్కెట్లుగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తున్నట్లు రాష్ట్ర మత్స, పశు సంవర్ధక శాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. మత్సశాఖ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్ కాంప్లెక్స్ వద్ద రూ.78.68 లక్షల వ్యయంతో నిర్మించిన అధునాతన చేపల మార్కెట్ ను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మంత్రి వెంకట రమణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రజలకు పరిశుభ్రమైన శాఖాహారం, మాంసాహారం అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మార్కెట్లలో అధునాతనంగా అన్ని ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. ప్రజలకు మంచి పాలన అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయమని, అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ నిర్మించిన అధునాతన చేపల మార్కెట్ అమ్మకందారునికి, కొనుగోలుదారునికి ఎంతో సౌకర్యంగా ఉండేలా నిర్మాణం చేశారని, దీనిని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. అనంతరం మండలంలోని వడ్లమూరు గ్రామంలో అందరికీ ఇళ్లు స్థలాల లేఅవుట్ ను మంత్రి పరిశీలించారు. ఈ కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాధ్, తెలుగుదేశం పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్, సామర్లకోట పిఏసిఎస్ అధ్యక్షులు దవులూరి దొరబాబు, ఆర్డీవో ఎస్. మల్లిబాబు, మత్సశాఖ డిప్యూటీ డైరెక్టర్ (ఇంఛార్జ్) ఎన్. శ్రీనివాసరావు, అసిస్టెంట్ డైరెక్టర్ జి. వెంకటేశ్వరరావు, పెద్దాపురం అసిస్టెంట్ ఇనస్పెక్టర్ ఆప్ ఫిషరీస్ కె. శ్రీరామకృష్ణ, మున్సిపల్ కమీషనర్ గుంటూరు శేఖర్, ఆర్&బి ఎస్ఈ విజయ్ కుమార్, డిఈ అంబటి సూర్య ప్రకాశ రావు, తహసీల్దార్ బూసి శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us