UPDATED 25th OCTOBER 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: సమాజంలో మార్పు రావాలంటే జనసేన పార్టీతోనే సాధ్యమని జనసేన నాయకులు అన్నారు. పెద్దాపురం నియోజకవర్గ నాయకులు తుమ్మల రామస్వామి నాయుడు(బాబు) ఆధ్వర్యంలో జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనబాట కార్యక్రమం గురువారం మండల పరిధిలోని కాపవరం, నవర, ఉండూరు, పి.వేమవారం గ్రామాల్లో నిర్వహించారు. ఉభయగోదావరి జిల్లాల కోఆర్డినేటర్ కాల్వకొలను తులసీరావు, తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ పంతం నానాజీ, కందుల దుర్గేష్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. గ్రామాల్లో ఇంటికి ఇంటికి పర్యటించి జనసేన పార్టీ రూపొందించిన పార్టీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఉభయ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ తులసీరావు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇంటి ఇంటికి జనసేన పధకాలను వివరించడం కోసం జనబాట కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా జాయింట్ కోఆర్డినేటర్ శెట్టిబత్తుల రాజబాబు, పేసంగి ఆదినారాయణ, అత్తిలి సీతారామస్వామి, చల్లా లక్ష్మి, కృష్ణ ప్రియ, కడలి ఈశ్వరి, మాకినీడి శేషుకుమారి, సుబ్రహ్మణ్యం, నున్న రమేష్ నాయుడు, సరోజ్ వాసు, పెంకే వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.







