అన్నవరం దేవస్థానం అభివృద్ధికి వినతి

అన్నవరం (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: అన్నవరం దేవస్థానం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కాకినాడ ఎంపీ వంగా గీత, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌, దేవస్థానం ఛైర్మన్‌ ఐ.వి. రోహిత్‌, ఈవో వి.త్రినాథరావు కోరారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆయన్ను ఆదివారం కలిశారు. దేవస్థానానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. కేంద్ర పథకం ప్రసాద్‌ ద్వారా దేవస్థానానికి ఎక్కువ నిధులు మంజూరుచేయాలని కోరారు. రూ.92.04 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని, సంబంధిత పనుల వివరాలు తెలిపారు. త్వరితగతిన నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలో అన్నవరం వస్తానన్నారని ఈవో తెలిపారు. పీఆర్వో కొండలరావు, దేవస్థానం వ్రతపురోహిత సంఘం అధ్యక్షుడు నాగాభట్ల రవి పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us