UPDATED 8th JUNE 2017 THURSDAY 2:00 PM
పెద్దాపురం: భక్తుల కొంగు బంగారం కొరిన వరాలిచ్చే చల్లని తల్లి పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో గురువారం ఘనంగా చండీహోమం నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ ఆర్. పుష్పనాథం ఆధ్వర్యంలో ఈ హోమాన్ని నిర్వహించారు. వేద పండితులు ఐ.వి.ప్రసాద్ శర్మ, ఎ.వి.భానుమూర్తి, ఎన్.వి శాస్త్రి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ లు, భక్తులు పాల్గొన్నారు.







