అర్హులైన లబ్ధిదారుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించాలి:ఆర్డీవో

పెద్దాపురం,14 మే 2020(రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పేదలందరికీ ఇళ్లు పథకంలోని అర్హులైన లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయ నోటీసు బోర్డులో ప్రదర్శనపై తహశీల్దార్లు, ఎంపీడీవోలు తనిఖీ చేయాలని ఆర్డీవో ఎస్.మల్లిబాబు ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో డివిజన్లోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు,ఎన్..ఆర్.ఈ.జి.ఎస్,హౌసింగ్ అధికారులతో డివిజన్ స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ డివిజన్లో ఇప్పటివరకు పూర్తి చేసిన లేఅవుట్,స్టోన్ ప్లాంటేషన్, రోడ్లు,ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ లెవెలింగ్ పనులపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. అలాగే మండలాల్లో లబ్ధిదారులకు అవసరమైన ప్రైవేటు భూముల కొనుగోలుకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన పేమెంట్,ఇంకా రావాల్సిన పేమెంట్ పై చర్చించారు. మండలాలకు సంబంధించిన లే అవుట్ పనులలో డిఐఎస్ జోషీలా క్షేత్రస్థాయి పరిశీలన సరిగా చేపట్టడం లేదని ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తహశీల్దార్లు,ఎంపీడీవోలు భూసంస్కరణలకు సంబంధించి కొంతమంది అవగాహన రాహిత్యంతో సమాచారం పూర్తిస్థాయిలో లేదని ఆర్డీవో అసంతృప్తిని వ్యక్తం చేశారు. మండల సర్వేయర్లు లే అవుట్ మ్యాపులలో అప్రోచ్ రోడ్డు గుర్తించడంలో తప్పులు దొర్లుతున్నాయని, వీటిని కూడా సంబంధిత అధికారులు పరిశీలించుకోవాలని సూచించారు.డివిజన్ లోని కొన్ని మండలాల్లో విధులలో అలసత్వం వహిస్తున్న సర్వేయర్లపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డిఐఎస్ జోషీలాను ఆదేశించారు. లే అవుట్ లో రోడ్డును గుర్తించడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తహశీల్దార్లు,ఎంపీడివోలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. గ్రామ సచివాలయాల సిబ్బందికి పేదలందరికీ ఇళ్లకు సంబంధించిన అర్హులు, అనర్హుల గుర్తించే పని పూర్తి స్థాయిలో జరిగేలా చర్యలు తీసుకోవాలి అన్నారు.అలాగే కోవిడ్-19 కు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ప్రతీ తహశీల్దార్లు, కోవిడ్-19 కమిటీ సభ్యులకు పంపడం జరిగిందని,వ్యాపార సమయాలు కేటాయించిన ఆయా సమయాల్లో వ్యాపారాలు తెరచి,మూసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి వస్తున్న వారిని ఆయా గ్రామ సచివాలయాల్లో ప్రత్యేక రిజిస్టర్ లో వారి పేరు, అడ్రస్, ఫోన్ నంబర్, ఏ ప్రాంతం నుంచి వచ్చారో వివరాలను తప్పనిసరిగా రిజిస్టర్ లో నమోదుకు చర్యలు తీసుకోవాలన్నారు కమ్యూనిటీ క్వారంటైన్ లో ఉంచిన వారిని కోవిడ్-19 ముద్ర వేసి వారి స్వగృహాలకు పంపాలని, ఏ ఆధారం లేని వారిని మాత్రం క్వారంటైన్ లొనే ఉంచాలని తెలిపారు. జూలై 8 వతేదీన రాష్ట్రవ్యాప్తంగా పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని, ఇప్పటి నుండి జూన్ 30 వ తేదీలోపు దీనికి సంబంధించిన పనులను పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ సుధాకర్ పట్నాయక్, తహశీల్దార్ బి.శ్రీదేవి, ఎంపిడివో అబ్బిరెడ్డి రమణారెడ్డి,డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, ఎంపిడివోలు, హౌసింగ్, ఏపీవోలు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us