Aadhaar: పుట్టిన వెంటనే ఆధార్‌.. జారీకి ఉడాయ్‌ సన్నాహాలు!

ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: నవజాత శిశువులకు ఆధార్‌ కార్డు జారీ మరింత తేలిక కానుంది. పుట్టిన వెంటనే ఆస్పత్రుల్లోనే చిన్నారులకు ఆధార్‌ జారీ చేసే ప్రక్రియ త్వరలోనే మొదలు కానుంది. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సన్నాహాలు చేస్తున్నట్లు ఉడాయ్‌ సీఈవో సౌరభ్‌ గార్గ్‌ ఈ విషయం వెల్లడించారు. ఇందుకోసం రిజిస్ట్రార్‌ ఆఫ్‌ బర్త్ విభాగంతో సంప్రదింపులు జరుపుతున్నామని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘అప్పుడే పుట్టిన పిల్లలకు ఆస్పత్రిలోనే వారి ఫొటో తీసుకొని ఒక్క క్లిక్‌తోనే ఆధార్‌ కార్డు జారీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఐదేళ్లలోపు చిన్నారులకు బయోమెట్రిక్‌ అవసరం లేదు. కేవలం వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి (తల్లి లేదా తండ్రి) ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేస్తాం. ఐదేళ్లు పూర్తైన తర్వాత చిన్నారుల బయోమెట్రిక్‌ తీసుకుంటాం’ అని ఉడాయ్‌ సీఈవో సౌరభ్‌ గార్గ్‌ వెల్లడించారు. ఇప్పటికే 99.7 శాతం మందికి (131 కోట్ల మంది) ఆధార్‌ కార్డు జారీ చేశామని, ఇక నవజాత శిశువుల ఆధార్‌ నమోదుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఏటా 2-2.5 కోట్ల జననాలు జరుగుతున్నాయన్న ఆయన.. వారికి పుట్టిన వెంటనే ఆధార్‌ నంబర్‌ కేటాయించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని చెప్పారు. మరోవైపు ఆధార్‌ను ప్రపంచవ్యాప్తం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఉడాయ్‌ సీఈవో ఇటీవలే వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ ఐడెంటిటీ కోసం వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఆయా దేశాలకు అనుగుణంగా ఆధార్‌లో పలు మార్పులు చేసేందుకు ప్రపంచ బ్యాంక్‌, ఐక్యరాజ్యసమితితో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించిన విషయం తెలిసిందే.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us