UPDATED 3rd APRIL 2022 SUNDAY 07:15 AM
AP Districts Collectors : ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ శనివారం అర్ధరాత్రి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్లు జారీ చేసింది.
అర్ధరాత్రి తర్వాత.. శ్రీకాకుళం జిల్లాతో తొలి నోటిఫికేషన్ జారీ అయ్యింది. తర్వాత ఒక్కో జిల్లాకు ఒక్కోటి చొప్పున నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. రేపట్నుంచి కొత్త జిల్లాలు అమలులోకి వస్తాయని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. కొత్త జిల్లాలను ప్రతిపాదిస్తూ జనవరి 25న ప్రభుత్వం తొలి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని స్థూలంగా నిర్ణయించుకుని.. విస్తీర్ణం దృష్ట్యా అరకును మాత్రం రెండు జిల్లాలుగా విభజించింది. 13 జిల్లాలను 26కు పెంచింది. ఏపీలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 72కు చేరింది. ఏపీలో కొత్తగా 21 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేశారు. దీంతో ఏపీలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుంచి 73కు పెంచారు. విజయవాడ కేంద్రంగానే కృష్ణా జిల్లా ఏర్పాటు ఉండనుంది. కుప్పం కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను నియమిస్తూ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
26 జిల్లాలకు కలెక్టర్లు..
శ్రీకాకుళం కలెక్టర్‌గా శ్రీకేష్ బాలాజీరావ్
విజయనగరం కలెక్టర్‌గా సూర్యకుమారి
మన్యం కలెక్టర్‌గా నిషాంత్ కుమార్
విశాఖ కలెక్టర్‌గా మల్లికార్జున్
అల్లూరి సీతారామరాజు కలెక్టర్‌గా సుమిత్ కుమార్
అనకాపల్లి కలెక్టర్‌గా రవి సుభాష్
కాకినాడ కలెక్టర్‌గా కృతికా శుక్లా
తూర్పు గోదావరి కలెక్టర్‌గా మాధవీలత
కోనసీమ కలెక్టర్‌గా హిమాన్ష్ శుక్లా
పశ్చిమ గోదావరి కలెక్టర్‌గా ప్రశాంతి
ఏలూరు కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేశ్
కృష్ణా కలెక్టర్‌గా రంజిత్ భాషా
ఎన్టీఆర్ కలెక్టర్‌గా ఎస్.దిల్లీరావు
గుంటూరు కలెక్టర్‌గా ఎమ్.వేణుగోపాల్‌రెడ్డి
పల్నాడు కలెక్టర్‌గా శివశంకర్ లతోటి
బాపట్ల కలెక్టర్‌గా కె.విజయ
ప్రకాశం కలెక్టర్‌గా దినేశ్ కుమార్
నెల్లూరు కలెక్టర్‌గా కేవీఎన్ చక్రధరబాబు
తిరుపతి కలెక్టర్‌గా కే.వెంకటరమణారెడ్డి
చిత్తూరు కలెక్టర్‌గా హరినారాయణ్
అన్నమయ్య కలెక్టర్‌గా గిరీష వైఎస్ఆర్
కడప కలెక్టర్‌గా విజయరామరాజు
సత్యసాయి కలెక్టర్‌గా బసంత్ కుమార్
అనంతపురం కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మి
నంద్యాల కలెక్టర్‌గా మంజీర్ జిలానీ శామూన్
కర్నూలు కలెక్టర్‌గా కోటేశ్వరరావు