జాతీయ అవార్డుకు ఎంపికైన కౌశల్ గోదావరి ప్రోజెక్ట్

UPDATED 1st JUNE 2018 FRIDAY 7:30 PM

కాకినాడ: పేదవర్గాల యువతకు వృత్తి నైపుణ్యాలలో శిక్షణ అందించి ఉపాధి అవకాశాల కల్పించేందుకు జిల్లాలో వినూత్నంగా చేపట్టిన కౌశల్ గోదావరి ప్రోజెక్ట్ ప్రతిష్టాత్మకమైన స్కోచ్ (SKOCH) ఆర్డర్ ఆఫ్ మెరిట్ జాతీయ అవార్డుకు ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని వివిధ జిల్లాలు, మున్సిపాలిటీలు, రాష్ట్ర శాఖల నుంచి ఈ అవార్డుకు ప్రతిపాదించిన 1000 ప్రాజెక్టుల్లో, ఎంపికైన అత్యుత్తమ 100 ప్రాజెక్టుల్లో ఒకటిగా తూర్పుగోదావరి జిల్లా నుంచి కౌశల్ గోదావరి ప్రోజెక్ట్ నిలవడం ముదావహమన్నారు. ఈ నెల 22వ తేదీన న్యూడిల్లీ, రఫీ మార్గ్ లోని కానిస్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా నిర్వహించనున్న 52వ స్కోచ్ సమ్మిట్ లో ఈ అవార్డును జిల్లాకు ప్రదానం చేయనున్నారని కలెక్టర్ తెలిపారు. వృత్తి నైపుణ్యాల శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాల కల్పనతో పాటు, నిండు విశ్వాసంతో స్వయం ఉపాధి చేపట్టి ఎంటర్ ప్రెన్యూర్లుగా ఎదిగేందుకు కౌశల్ గోదావరి ప్రోజక్ట్ ద్వారా జిల్లా యువతకు ప్రోత్సహం అందించడం జరుగుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, కాపు కార్పోరేషన్ ద్వారా ఎంపికైన లబ్దిదారులు ఎంపిక చేసుకున్న ఉపాధి యూనిట్లను విజయవంతంగా నిర్వహించుకునేందుకు అవసరమైన అవగాహన, శిక్షణ ఈ ప్రోజెక్ట్ అందిస్తోందన్నారు. అలాగే పోలవరం ప్రోజెక్ట్ నిర్వాసిత కుటుంబాల యువతకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని తెలిపారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 24 వేల కుటుంబాలు కౌశల్ గోదావరి ప్రోజెక్ట్ ద్వారా లబ్ది పొందాయన్నారు. ప్రోజెక్ట్ ద్వారా నిర్వహించిన డైరెక్ట్ జాబ్ ప్లేస్ మెంట్ సేవలను 11,825 మంది జిల్లా యువత సద్వినియోగం చేసుకున్నారని, అలాగే 3,853 మంది యువత శిక్షణ ద్వారా ఉద్యోగాలను పొందారని తెలియజేశారు. ప్రాజెక్ట్ ద్వారా ఉద్యోగాలు పొందిన యువత సగటున రూ.11,118/- నెలసరి వేతనం పొందడం గమనార్హమన్నారు. స్వయం ఉపాధి రంగంలో 2,588 మంది అభ్యర్థులు స్కిల్ అప్ గ్రేడేషన్ కోర్సులలో శిక్షణ పొందగా, 5,661 మంది అభ్యర్థులకు వర్క్ షాప్ మోడ్ లో  శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. 171 ప్రయివేట్ కంపెనీలు, 32 ట్రయినింగ్ పార్టనర్లు, 40 మంది శిక్షకులు ఈ ప్రోజెక్ట్ లో భాగస్వామ్యం వహించారన్నారు. కౌశల్ గోదావరి ప్రోజెక్ట్ ద్వారా 2018-19 సంవత్సరంలో మరో 25 వేల యువతీ, యువకులకు శిక్షణ, ఉపాధి కల్పించే కార్యాచరణ ప్రణాళిక చేపట్టామని తెలిపారు. ఈ ప్రోజెక్ట్ ను విజయవంతం చేసి, జాతీయ అవార్డు సాధనకు కృషి చేసిన అధికారులు, సిబ్బంది, శిక్షకులు, భాగస్వామ్య సంస్థలు అందరికీ కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us