Diabetes: తీపి తులసి.. మధుమేహ రోగులకు ఎంతో సురక్షితం

తిరువనంతపురం (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: తీపి తులసి ఆకు.. పంచదారతో పోలిస్తే 30 రెట్లు తియ్యగా ఉంటుంది. అయినా మధుమేహ రోగులకు ఎంతో సురక్షితం. అద్భుత లక్షణాలు కలిగిన ఈ మొక్క ఇప్పుడు కేరళలో అత్యంత ప్రాచుర్యం పొందింది. కన్నూర్‌ జిల్లా పరియారమ్‌ గ్రామానికి చెందిన కేవీ షాజీ.. ఇటీవల ఈ మొక్కలోని ఔషధ గుణాలను తెలుసుకుని ఆకర్షితుడయ్యారు. దానిని సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. తిరువనంతపురం నుంచి కొన్ని మొక్కలను తీసుకొచ్చి.. తన భూమిలో పెంచడం ప్రారంభించారు. రక్తంలోని చక్కెర స్థాయిని, బీపీని నియంత్రించే మంచి గుణాలు తీపి తులసి మొక్కలో ఉన్నాయని ఆయన చెబుతున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us