UPDATED 17th JULY 2018 TUESDAY 9:00 PM
అన్నవరం: అన్నవరం గిరిప్రదక్షిణ కోసం ఏర్పాటు చేస్తున్న రోడ్డు మార్గాన్ని పెద్దాపురం ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంత రాయుడు, శంఖవరం తహసీల్దార్ సుజాత, దేవస్థానం పిఆర్వో తులా రాముడుతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా పిఆర్వో మాట్లాడుతూ రూ. మూడు కోట్లుతో చేపడుతున్న గిరిప్రదక్షిణ ప్రాజెక్టు వివరాలు ఆర్డీవోకు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గిరిప్రదక్షిణ ఏర్పాటు ద్వారా అన్నవరం మరింత మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. చెట్లను అలాగే ఉంచి రోడ్డు మార్గాన్ని నిర్మించడం వల్ల భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుందన్నారు. రోడ్డు ప్రక్కన పంపానది ఉన్నందున ప్రహారీగోడ కూడ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.







