వంచనపై గర్జనకు తరలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

UPDATED 30th NOVEMBER 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: విభజనతో నష్టపోయిన నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన వంచనపై గర్జన కార్యక్రమానికి  పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో మోటార్ సైకిళ్లపై కాకినాడ తరలి వెళ్లారు. పెద్దాపురం నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ర్యాలీలో భాగంగా స్థానిక ప్రసన్నఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం వెంకట కృష్ణరాయపురం, మాధవపట్నం మీదుగా భారీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకటప్పారావు చౌదరి, సొసైటీ అధ్యక్షుడు కొప్పిరెడ్డి రాధాకృష్ణ, కార్మిక సంఘం నాయకులు దవులూరి సుబ్బారావు, కౌన్సిలర్లు ఊబా జాన్ మోజస్, పితాని సూర్యనారాయణ, వాసంశెట్టి గంగ, జిల్లా కార్యదర్శులు మేకా శ్రీను, ఆదపురెడ్డి శ్రీనివాసు, ఇనుకొండ విష్ణుచక్రం, పెద్దాపురం పట్టణ అధ్యక్షుడు కాపుగంటి కామేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ అచ్చిరాజు, గవరసాని సూరిబాబు, యూత్ అధ్యక్షుడు గోపు మురళీ, మాజీ జడ్పీటిసి సభ్యులు బొబ్బరాడ సత్తిబాబు, బంగారు కృష్ణ, పుట్టా సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us