UPDATED 31st AUGUST 2017 THURSDAY 11:30 AM
పెద్దాపురం: సమాజంలో పాత్రికేయులపై రోజురోజుకు పెరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే పెద్దాపురం నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్ష, కార్యదర్శులు బూరాడ శ్రీనివాసరావు, రెడ్డిపల్లి రమణమూర్తి (బుల్లియ్య) మాట్లాడుతూ ఇటీవల కిర్లంపూడిలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన పాదయాత్ర వార్తను చిత్రీకరించే సమయంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు మహా టీవీ రిపోర్టర్ పచ్చాకుల లోవరాజుపై దాడి చేయడమే కాకుండా అతని కెమెరాను అపహరించుపోయారని, ఇటువంటి ఘటనలు చూస్తే సమాజంలో పాత్రికేయులకు రక్షణలేకుండా పోయిందని వాపోయారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయులపై దాడులు పెరిపోతున్నాయని వాటిని నివారించేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని, నిజాలు నిర్భయంగా రాసే పాత్రికేయుల రక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్దోవో వి. విశ్వేశ్వరరావుకు వినతి పత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాకుర్తి రాంబాబు, జిల్లా సహాయ కార్యదర్శి మాసా చంద్రరావు (చందు), ఈసీ మెంబర్ వీరభద్రవర్మ, అడపా వెంకటరావు, బద్ది కుమార్, చంద్రదాసు, విజయ్, మల్లేష్, ఆలీ, సుధాకర్, రాంప్రసాద్, వినాయక్, వెంకట్, ఆనంద్, సిద్దు తదితరులు పాల్గొన్నారు







