Krishnamraju: రా'రాజు'కు ఇక సెలవు.. అశ్రునయనాల మధ్య ముగిసిన కృష్ణంరాజు అంత్యక్రియలు

UPDATED 12th SEPTEMBER 2022 MONDAY 03:00 PM

Krishnamraju : ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి కనకమామిడి ఫాంహౌస్ వరకు ఆయన పార్థివదేహానికి అంతిమయాత్ర నిర్వహించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. కృష్ణంరాజుకు ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారిక లాంఛనాల్లో భాగంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఆయనకు గన్ సెల్యూట్ చేశారు. అంత్యక్రియలకు అనుమతి ఉన్నవారిని మాత్రమే ఫాంహౌస్ లోపలికి పోలీసులు అనుమతించారు. భద్రతా ఏర్పాట్లను శంషాబాద్ డీసీపీ పర్యవేక్షించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us