UPDATED 12 th AUGUST 2017 SATURDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల లో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా స్టూడెంట్స్ చాప్టర్ ను శనివారం ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆంధ్రాయూనివర్సిటీ ప్రొఫెసర్ అవధాని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్ యొక్క ప్రాధాన్యం సి ఎస్ ఈ మొదలైన వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే ఆంధ్రాయూనివర్సిటీ సి ఎస్ ఐ సభ్యులు అనింద్యపాల్, జగన్నాధ వర్మ , పి. బలరాం తదితరులు మాట్లాడుతూ విద్యార్థులు మంచి జ్ఞానం క్రమశిక్షణతో నడుచుకోవాలని, ప్రతీ విద్యార్థి నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకుని సాధన దిశగా కృషి చేయాలని సూచించారు. వేగంగా రూపాంతరం చెందుతున్న నేటి విద్యకు అనుగుణంగా మనం మారడం అలవాటు చేసుకోవాలని, విప్లవాత్మకమైన మార్పులను టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో నిష్ణాతులైన ప్రొఫెసర్లచే విద్యార్థులకు పేపర్ ప్రెసెంటేషన్, ప్రోజెక్టుల రూపకల్పన మొదలైన విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, సి ఎస్ ఈ విభాగాధిపతి ఎం . అనిల్ కుమార్, ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్.రమాశ్రీ, ఆర్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.







