కనులపండువగా సహస్ర దీపాలంకరణ

ముగిసిన మార్గశిర మాసోత్సవాలు

విశాఖపట్టణం(రెడ్ బీ న్యూస్) 3 జనవరి 2022: గత నెల రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరిగిన కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉత్సవాల సమయంలోఅమ్మవారిని 5లక్షల మందికిపైగా భక్తులు దర్శించుకుని ఉంటారని ఆలయ వర్గాల అంచనా. ఆదివారం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో విశేష పంచామృతాభిషేక సేవలు జరిపారు. ఆలయ అనివేటి మండపంలో నెల రోజుల నుంచి జరుగుతున్న లక్ష్మీహోమం, శ్రీచక్రనవర్ణార్చన, సప్తశతీ, వేద, మహా విద్యాపారాయణం క్రతువులు ముగిశాయి. వాటికి ముగింపుగా ఆదివారం ఉదయం ఆలయ ఆవరణలో మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఈఓ ఎస్‌.జె.మాధవి పూజా సామగ్రి వేశారు. ఏఈఓలు వి.రాంబాబు, పి.రామారావు, తదితరులు పాల్గొన్నారు. * ఆలయ ఆవరణలో సాయంత్రం చేపట్టిన సహస్ర దీపాలంకరణ సేవ కనులపండువగా సాగింది. బురుజుపేటకు చెందిన యువత 1016 దీపాలతో పూర్ణకలశం ఆకృతిని తీర్చిదిద్దారు. పాలక మండలి ఛైరపర్సన్‌ సింహాచలం, ట్రస్టీలు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us