హలో... మీ ఇంట్లో ఏసీ ఉందా

Updated 30th April 2017 Sunday 9:00 AM

Redbeenews: మండుతున్నఎండలకు తట్టుకోలేక చాలామంది ఇంట్లో ఏసీకి అలవాటు పడ్డారు. బయటకు వచ్చామంటే ఏసీ బస్సో, లేదా ఏసీ క్యాబ్‌లోనో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఏసీ ఉపయోగించేవాళ్ళు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. సహజమైన వాతావరణంలో శరీరం భరించదగ్గ ఉష్ణోగ్రతలో జీవించడం జీవరాసులన్నింటికీ ప్రకృతి పరమైన రక్షణ కల్పిస్తుంది. కానీ ప్రకృతి విరుద్ధమైన పద్ధతుల్లో కృత్రిమ చల్లదనం కోసం మనం వేసే ప్రతి అడుగూ ఆరోగ్యానికి ప్రమాదమే అంటున్నారు నిపుణులు. అదేపనిగా ఏసీలో కూర్చొని పనిచేస్తే.. పని ముగిసే సమయానికి భరించలేని తలనొప్పి, నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తాయి. చల్లటి వాతావరణంలో కండరాలకు తగినంత రక్తప్రసరణ జరుగకపోవడం వల్ల అలసటకు గురవుతారు. పొడి చర్మం ఉన్న వారు ఏసీలో ఎక్కువసేపు గడపడం వల్ల చర్మంపై తేమ తగ్గి చర్మం పొడిబారుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే చర్మంపై మాయిశ్చరైజర్‌ని రాసుకోవాలి. దీర్ఘకాలిక సమస్యలు అంటే.. ఆర్థరైటిస్, న్యూరైటిస్ వంటి జబ్బులు ఉన్నవారిలో ఆ సమస్యలు తీవ్రమవుతాయి. కొందరిలో ఈ న్యూరైటిస్ కారణంగా నిస్సత్తువ కలిగే అవకాశాలు ఎక్కువ. గతంలో వేడి వాతావరణంలో ఉన్నవారైనప్పటికీ నిత్యం ఏసీలో ఉండడం అలవాటైన వారు ఇక ఏ మాత్రం వేడిని భరించలేరు. దాంతో తేలిగ్గా వడదెబ్బకు గురవుతారు. చాలాసేపు ఏసీ కారులో, మూసి ఉన్న డోర్స్ వల్ల అక్కడి సూక్ష్మజీవులు అక్కడే తిరుగుతుండం వల్ల తేలిగ్గా శ్వాస సంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు. నిత్యం ఏసీలో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి కాసేపు బయటకు వచ్చి సహజ వాతావరణంలో పదినిమిషాల పాటైనా గడిపి వెళ్తుండాలి. అలా చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us