Crime News : తునిలో టిడిపి నేతపై కత్తితో దాడి

UPDATED 17th NOVEMBER 2022 THURSDAY 10:20 AM

Crime News : కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. స్వామిమాల వేసుకున్న దుండగుడు భిక్ష తీసుకుంటున్న క్రమంలో తన వద్దనున్న కత్తితో ఒక్కసారిగా శేషగిరిరావుపై దాడి చేశాడు. ఈ ఘటనలో శేషగిరిరావు చేతికి, తలకు బలమైన గాయాలయ్యాయి.

గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం నిందితుడు బైక్ పై పరారయ్యాడు. సమాచారం అందుకున్న తుని పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us