UPDATED 26th AUGUST 2017 SATURDAY 7:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో గల కళాశాలలు సంయుక్తంగా నిర్వహించే జాతీయస్థాయి టెక్ ఫెస్ట్ వేద-2 కె 17 పోస్టర్ ను ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాస రెడ్డి, డాక్టర్ టి. కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్ "వేద-2 కె 17 " ను అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చే నెల సెప్టెంబర్ 15,16 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ టెక్ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నామని, రాష్ట్రం నలుమూలలనుంచి కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన కళాశాలల నుంచి వచ్చే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ విభాగాన్ని సమర్ధవంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు కమిటీలు వేశామని, తమ కళాశాలలో గల వివిధ బ్రాంచ్ లకు ప్రాధాన్యం కల్పిస్తూ ఆయా బ్రాంచ్ లలో పేపర్ ప్రెజెంటేషన్ , పోస్టర్ ప్రెజెంటేషన్, ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్, సాంస్కృతిక ప్రదర్శనలు రూపొందించడం జరుగుతుందన్నారు. అన్ని కళాశాలలకు పోస్ట్ ద్వారా ఈ పోస్టర్ ను పంపడం జరుగుతుందని పూర్తి వివరాలకు www.aec.edu.in /veda వెబ్ సైట్ ను చూడవచ్చన్నారు. క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి మూడు స్థానాలు పొందిన వారికి నగదు పురస్కారంతో పాటు జ్ఞాపిక, ప్రశంశాపత్రం అందచేయడం జరుగుతుందని పేర్కొన్నారు.







