లాక్ డౌన్ లో విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి:సీపీయం

సామర్లకోట,18 మే 2020(రెడ్ బీ న్యూస్):లాక్ డౌన్ లో వచ్చిన అధిక బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని సీపీయం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పిఠాపురం రోడ్ లో విద్యుత్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీయం జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాద్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచమని చెపుతూనే కొత్తరకం శ్లాబుల పేరుతో పేద ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఒకపక్క కరోనా వల్ల ఇంటి వద్దే ఉంటున్న వినియోగదారులకు ఇష్టానుసారంగా విద్యుత్ బిల్లులు పెంచడంతో ఒకపక్క ఉపాధిలేక, మరోపక్క పెరిగిన నిత్యావసరాలతో పాటు విద్యుత్ బిల్లులు కూడా పెరిగిపోవడంతో పేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. కేంద్రం విద్యుత్ రంగానికి రూ. 20 లక్షల కోట్లు కేటాయించిందని దీనిలో నుంచే కరోనా సమయంలోని విద్యుత్ బిల్లులను ప్రభుత్వం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శాఖా కార్యదర్శులు బాలం శ్రీనివాస్,తుంపాల శ్రీనివాస్, కరణం గోవింద రాజు,కరణం శ్రీ ను,పి. వీరబాబు, బాలం సత్తి బాబు, బి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us