Collector Dr.Kruthika Shukla : వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ కృత్తికా శుక్లా

UPDATED 17th OCTOBER 2022 MONDAY 06:00 PM

Collector Dr.Kruthika Shukla : కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట వద్ద దబ్బ కాలువ‌పై వంతెన నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి కాండ్రకోట సమీప గ్రామాల ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు.

ఏలేరు వరద ఉధృతికి ఈనెల 16వ తేదీన కొట్టుకుపోయిన కాండ్రకోట దబ్బకాలువ వంతెన (Bridge) ప్రాంతాన్ని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాండ్రకోట సమీప గ్రామాలైన జె. తిమ్మాపురం, కట్టమూరు, తూర్పుపాకలు గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం వ్యవసాయ, ఇతర పనుల నిమిత్తం రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా తాత్కాలికంగా బ్రిడ్జి పనులకు చర్యలు చేపట్టాలన్నారు. ఏలేరు కాలువకు వరద ముంపు సంద‌ర్భంలో ఏర్పడే సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు దబ్బకాలువపై వంతెన నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జలవనరులు, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో పెద్దాపురం ఆర్‌డీవో జె. సీతారామారావు, డీఎల్‌డీవో కె.ఎన్.వి. ప్ర‌సాదరావు, పెద్దాపురం ఇరిగేషన్ ఈఈ డి.వి. రామ్ గోపాల్ , ఏఈ పి. వీరబాబు, ఏడీఏ నల్లి దైవకుమార్, హార్టికల్చర్ ఆఫీసర్ నూనె సుజాత, తహసీల్దార్ వజ్రపు జితేంద్ర, జెడ్పీటీసీ సభ్యుడు గవరసాన సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us