ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ ప్రిన్సిపాల్ విశాలాక్షికి ఘన సన్మానం

UPDATED 3rd AUGUST 2017 THURSDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ ప్రిన్సిపాల్ గా సేవలందిస్తున్నడాక్టర్ ఎన్.విశాలాక్షిని గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.సుగుణారెడ్డి చేతుల మీదుగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు దశాబ్దాలుగా అత్యుత్తమ క్రమశిక్షణతో విద్యనందిస్తున్న విశాలాక్షి అధ్యాపకురాలిగా, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, విభాగాధిపతి, పరీక్షల పర్యవేక్షణ విభాగాధిపతి, ప్రిన్సిపాల్ గా వివిధ విభాగాలను సమర్ధవంతంగా సేవలందించారు. బిజినెస్ స్కూల్ డైరెక్టర్  డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ ఆదిత్యలో సుదీర్ఘ కాలం పాటు సేవలందిస్తున్న విశాలాక్షి ఆమె అందించిన సహకారం మరువలేనిదన్నారు. సన్మాన గ్రహీత విశాలాక్షి మాట్లాడుతూ తన ప్రయాణంలో యాజమాన్యం తన పట్ల వ్యవహరించిన తీరు, అందించిన సహకారం తనను ఎంతగానో ప్రభావితం చేశాయని, అందరితో స్నేహభావంతో ఉంటూ తనకు అప్పగించిన భాద్యతలను సక్రమంగా నిర్వహించగలిగానన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us