ఏపీలో మళ్లీ వాన... కడప జిల్లాలో పాఠశాలలకు సెలవు

అమరావతి (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021: ఇటీవల కురిసన వర్షాల నుంచి జనం ఇంకా తేరుకోక ముందే మళ్లీ వానలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. వరదల దృష్ట్యా కడప జిల్లాలోని అన్ని పాఠశాలలకు జిల్లా కలెక్టర్‌ సెలవు ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో వర్షాల కారణంగా అనేక చోట్ల రాకపోకలు స్తంభించాయి. చిట్వేలు మండలంలో ఎల్లమరాజు చెరువు నిండి అలుగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాపూరు-నెల్లూరు వైపు వెళ్లే వాహనాలకు అంతరాయమేర్పడింది. గుంజనఏరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. బాలపల్లికి శేషాచలం అడవుల నుంచి వరద భారీగా వస్తోంది. ప్రమాదకరంగా ఉన్న చెరువుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us