ప్రగతిలో జాతీయస్థాయి వర్క్ షాప్ ప్రారంభం

UPDATED 2nd FEBRUARY 2018 FRIDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజుల  జాతీయస్థాయి వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాల ఈఈఈ విభాగం ఐఐటి బొంబాయి సౌజన్యంతో ఫిబ్రవరి రెండు, మూడు తేదీల్లో ఐవోటి యూజింగ్ క్లౌడ్ సర్వర్ విత్ వైఫైబోటిక్స్ అనే అంశంపై అధునాతన సాంకేతిక అంశాలపై ఎలక్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నామన్నారు. వివిధ ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన 129 విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమం ద్వారా ఐవోటి పట్ల అవగాహన కలగడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కళాశాల వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్ మాట్లాడుతూ ఈ వర్క్ షాప్ వల్ల సాంకేతిక జ్ఞానం అభివృద్ధి చెందడమే కాక విద్యార్థులు తమదైన శైలిలో గుర్తింపు పొందడానికి దోహద పడుతుందన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, ఈఈఈ విభాగాధిపతి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ మాట్లాడుతూ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, జాతీయస్థాయి పోటీలలో తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేనేజ్మంట్ ఎం.వి. హరనాథబాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురాం, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, వివిధ విభాగాధిపతులు, కో- ఆర్డినేటర్లు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.      
 
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us