నాటుసారా తయారీ కేంద్రంపై దాడి

కొత్తపేట, 26 మే 2020 (రెడ్ బీ న్యూస్): కమ్మిరెడ్డిపాలెం మేకలదొడ్డి సమీపంలో ఒక భవనంలో నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో రావులవులెం సీఐ వి.కృష్ణ స్థానిక ఎస్.ఐ కె.రమేష్ తన సిబ్బందితో సారా తయారీ కేంద్రంపై మంగళవారం దాడి చేశారు. ఈ దాడుల్లో నిల్వ చేసిన బెల్లపు ఊట, నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతోపాటు బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారీకి ఉపయోగించే గ్యాస్ స్టౌవ్, బెల్లం,అమ్మోనియా,ఇతర సామాన్లను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.అనంతరం సీఐ మాట్లాడుతూ అమలాపురం డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా ఆదేశాలు మేరకు ఈ దాడులు నిర్వహించినట్టు తెలిపారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us